Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’

రాజకీయ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ కేరళ ( Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)ఆరోపించారు. 

Published : 24 Sep 2023 14:20 IST

తిరువనంతపురం: రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియా (Social media)ను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ ( Kerala)ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఆరోపించారు. త్రికరిపూర్‌లో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ( Congress)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తిరువనంతపురంలోని పరశాలకు చెందిన 26 ఏళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త అబిన్ కోడంకర సోషల్‌ మీడియా వేదికగా సీపీఎం పార్టీకి చెందిన సీనియర్‌ నేతల కుటుంబంలోని  మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడు. అభ్యంతరకర ఫొటోలను షేర్‌ చేసి వారిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు పోస్టు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారని.. అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు మన నాగరికతను కోల్పోకూడదని సీఎం పేర్కొన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా మన చర్యలు ఉండకూడదని సూచించారు.

అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు

‘‘రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కొందరు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తు) ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను వేధింపులకు గురిచేస్తూ ఆ పార్టీ సోషల్‌మీడియాను దుర్వినియోగం చేస్తోంది. వారిని ఇబ్బందులను గురిచేసేందుకు ప్రత్యేక ఏజన్సీలను రాష్ట్రానికి తీసుకు వచ్చింది. వీటికి రూ. లక్షలు వెచ్చిస్తోంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల వ్యక్తి  ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది’’ అని దుయ్యబట్టారు.

అంతేకాకుండా, ఇటువంటి చర్యలను సహించవద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని