Health Ministry: కొవిడ్‌ కట్టడిపై కేరళ దృష్టి పెట్టడం లేదు..!

కొవిడ్‌ కట్టడిపై కేరళ సర్కారు దృష్టి కేంద్రీకరించడంలేదని..  కేవలం కొవిడ్‌ తీవ్రత తగ్గించడంపైనే శ్రద్ధ వహిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Published : 27 Jul 2021 23:11 IST

దిల్లీ: కొవిడ్‌ కట్టడిపై కేరళ సర్కారు దృష్టి కేంద్రీకరించడంలేదని..  కేవలం కొవిడ్‌ తీవ్రత తగ్గించడంపైనే శ్రద్ధ వహిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు ఆరోపించాయి.  ఈ కారణంగా దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం కేరళ, మహారాష్ట్రల నుంచే వెలుగు చూస్తున్నట్లు వెల్లడించాయి. అయితే కేరళలో ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో అక్కడ మరణాల సంఖ్య తక్కువగా నమోదవడాన్ని ఊరటనిచ్చే అంశంగా పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌ ఉద్థృతి కొనసాగుతున్నప్పటికీ గత కొన్ని వారాలుగా  కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే కేరళలో మాత్రం కేసుల సంఖ్య పెరగడంపై అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

కేరళలో మంగళవారం కొత్తగా 22,129 కేసులు వెలుగుచూడగా.. 156 మరణాలు సంభవించాయి. పాజిటివిటీ రేటు 12.35 శాతంగా నమోదైంది. మరోవైపు వ్యాక్సిన్ల కొరతతో తిరువనంతపురం సహా చాలా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యాశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య విస్తృతంగా పెరగడంతో పరిస్థితులు మూడో వేవ్‌కు దారి తీస్తున్నాయనే ఆందోళనలు మొదలయ్యాయి.  అయితే కరోనా తొలి దశలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేస్తూ కలవరపడాల్సిన అవసరం లేదని ఇటీవల వీణా జార్జ్‌ వెల్లడించారు. 

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని