శబరిమల నిరసనకారులపై కేసులు వెనక్కి! 

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ......

Published : 24 Feb 2021 21:34 IST

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరువనంతపురం: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో చర్చించిన మంత్రివర్గం.. ఈ కేసులు అంత తీవ్రమైన నేర స్వభావం కలిగినవి కాదని పేర్కొంటూ వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2018 -19లో శబరిమలలోకి మహిళల ప్రవేశం అంశంలో చెలరేగిన నిరసనల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దాదాపు 2వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల స్పందిస్తూ.. ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని