కేరళలో పెట్రోల్‌, డీజిల్‌ ₹2 ప్రియం.. సెస్‌ వడ్డించిన విజయన్‌ సర్కార్‌

ఇకపై కేరళ ప్రజలు పెట్రోల్‌ డీజల్‌ కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాలి. ఎందుకంటే రెండింటిపై రూ.2 పెంచినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Published : 03 Feb 2023 23:21 IST

తిరువనంతపురం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్నట్లు కేరళ (Kerala)లోని విజయన్‌ సర్కారు శుక్రవారం ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిర్ణయాన్ని వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున సోషల్‌ సెక్యూరిటీ సెస్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కే.ఎన్‌. బాలగోపాల్‌ (K N Balagopal) తెలిపారు. ఈ ఏడాది కేంద్రం నుంచి అనుకున్నంత మేర సహకారం అందకపోవడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆయన.. ద్రవ్యోల్బణం అదుపుచేయటానికి బడ్జెట్‌లో రూ.2వేల (కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. లిక్కర్‌ ధరలను సైతం పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో తయారయ్యే విదేశీ మద్యంపై రూ.500-రూ.999  మధ్య ఒక్కో బాటిల్‌పై రూ.20 చొప్పున సోషల్‌ సెక్యూరిటీ సెస్‌ విధిస్తున్నట్లు తెలిపారు. తిరువనంతపురంలో  ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.71, డీజిల్‌ ధర రూ.96.52గా ఉంది.

పంజాబ్‌దీ అదే బాట

పెట్రోల్‌, డీజిల్‌పై సెస్సు విధించాలని పంజాబ్‌ సర్కారు సైతం నిర్ణయించింది. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 90 పైసలు చొప్పున సెస్సు విధిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ నేతృత్వంలో శుక్రవారం కేబినెట్‌ సమావేశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు