Published : 29 Aug 2021 01:25 IST

Corona: కేరళలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి.. మళ్లీ నైట్‌ కర్ఫ్యూ

తిరువనంతపురం: కేరళలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు సగానికి పైగా ఇక్కడే వెలుగుచూస్తున్నాయి. ఓవైపు కట్టడి చర్యలు తీసుకుంటున్నా .. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. దీంతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తామని సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. 

మరోవైపు, శనివారం కూడా కేరళలో కొత్త కేసులు 30వేల మార్కును దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24గంటల వ్యవధిలో 1,67,497 శాంపిల్స్‌ పరీక్షించగా.. 31,265 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 153 మంది వైరస్‌తో మృతిచెందినట్టు సీఎం వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో 39.77 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 20,466కి పెరిగింది. నిన్నటితో పోలిస్తే (19.22%) పాజిటివిటీ రేటు కాస్త తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18.67శాతంగా ఉంది. ఈరోజు కొవిడ్‌ సోకినవారిలో 96మంది ఆరోగ్య కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 37.51లక్షల మంది కోలుకోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,896 క్రియాశీల కేసులు ఉన్నాయి. త్రిస్సూరు జిల్లాలో అత్యధికంగా 3957 కొత్త కేసులు నమోదు కాగా.. ఎర్నాకుళంలో 3807, కోయ్‌కోడ్‌లో 3292 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని