Kerala: బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 142 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి కేరళలోని పోక్సో న్యాయస్థానం ఏకంగా 142 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.5లక్షల జరిమానా కట్టాలంటూ తీర్పునిచ్చింది.

Updated : 01 Oct 2022 20:01 IST

తిరువనంతపురం: కేరళలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5లక్షల జరిమానా కూడా వేసింది. ఆ జరిమానా కట్టలేకపోతే అదనంగా మరో మూడేళ్లపాటు జైలు శిక్ష అమలయ్యేలా న్యాయస్థానం తీర్పునిచ్చింది.

తిరువల్లలో నివసించే ఆనందన్‌ పీఆర్‌ అలియాస్‌ బాబు (41) ఓ పదేళ్ల బాలికపై రెండేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2019-21 కాలంలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువైన బాబు.. వారి ఇంట్లోనే ఉంటూ మంచివాడిలా నటిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తనపై జరుగుతున్న దారుణాన్ని ఇంట్లో చెప్పలేకపోయింది. కానీ చివరకు విషయం బయటపడటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని పతనంతిట్ట కోర్టులో ప్రవేశపెట్టగా.. తాజాగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని