Khargone Violence: మంత్రిని ‘టెర్రరిస్ట్‌’ అన్నందుకు 150 మందిపై కేసు..

మధ్యప్రదేశ్‌లో రామనవమి రోజు ఖర్గోన్‌లో జరిగిన ఘర్షణలు 10రోజులైనా ఇంకా సర్థుమణగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 158 మందిని అరెస్టు చేశారు.

Published : 18 Apr 2022 12:14 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో శ్రీరామనవమి రోజున ఖర్గోన్‌లో జరిగిన ఘర్షణలు 10రోజులైనా ఇంకా సద్దుమణగలేదు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 44 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 158 మందిని అరెస్టు చేశారు. ఖర్గోన్‌ వీధుల్లో నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కర్ప్యూను సడలిస్తున్నారు.  కాగా.. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చారు.

ఖర్గోన్‌ ఘర్షణల అనంతరం కొందరు సభ్యులు డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ  హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రాని ఉద్దేశిస్తూ టెర్రరిస్టు అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేసినందుకు పోలీసులు 150 మందిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు హింసాత్మక ఘటనల్లో తొలి మరణం చోటుచేసుకుంది. ఈ ఘటనల్లో ఒకరు మరణించినట్లు రాష్ట్ర హోం మంత్రి ధ్రువీకరించారు. ఏప్రిల్‌ 10న చోటుచేసుకున్న అల్లర్లలో 30 ఏళ్ల ఇబారిష్‌ ఖాన్‌ అలియాస్‌ సద్దాం అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని