అనాథకు కిడ్నీ దానం.. మోదీ ప్రశంస

అవసరం లేకపోతే అయినవాళ్లే దగ్గరకు రాని ఈ రోజుల్లో.. చావుబతుకుల్లో ఉన్న అనాథకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు ఓ మహిళ. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమె

Published : 16 Feb 2021 01:26 IST

దిల్లీ: అవసరం లేకపోతే అయినవాళ్లే దగ్గరకు రాని ఈ రోజుల్లో.. చావుబతుకుల్లో ఉన్న అనాథకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు ఓ మహిళ. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమె గొప్ప మనసుకు కొనియాడారు. ‘మీ నిస్వార్థ సాయానికి ఎంత ప్రశంసించినా తక్కువే’ అంటూ ఆ మహిళను అభినందించారు. 

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మానషి హల్దార్‌ 2014లో ఓ అనాథకు కిడ్నీ దానమిచ్చారు. అవయవ దానం మహాదానం అన్న మోదీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఈ సాయం చేశారు. ఇటీవల ఈ విషయం గురించి ఆమె ప్రధానికి లేఖ రాయగా.. తాజాగా మానషికి మోదీ ప్రత్యుత్తరం పంపారు. 

‘‘ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టేందుకు కిడ్నీ దానం చేసిన మీ గొప్ప మనసు గురించి తెలిసి చాలా ఆనందంగా ఉంది. మీరు చేసిన ఈ నిస్వార్థ సాయానికి ఎంత ప్రశంసించినా సరిపోదు. మన సంస్కృతి, సంప్రదాయాల్లోనే త్యాగం, కరుణ ఉన్నాయి. అవయవ దానం అన్నింటికంటే గొప్ప దానం. అది ఓ మనిషికి కొత్త జీవితాన్నిస్తుంది. మీ దాతృత్వం, ఔదార్యం ఎంతోమందికి ఆదర్శప్రాయం. మీ నుంచి ఎంతోమంది స్ఫూర్తి పొంది అవయవదానానికి ముందుకొస్తారని, మానవత్వాన్ని చాటుతారని ఆశిస్తున్నా. అవయవదానంపై ప్రచారం కల్పించాలి. అది ప్రజాఉద్యమంగా మారాలి. అప్పుడే అవసరంలో ఉన్నవారికి సత్వర సాయం అందుతుంది’’ అని మోదీ మానషికి కొనియాడారు. 

ఇదీ చదవండి..

వాలంటైన్స్‌ డే: భార్యకు గిఫ్ట్‌గా భర్త కిడ్నీ! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని