Singer KK: ‘సీపీఆర్ చేసి ఉంటే.. కేకే బతికేవారేమో..!’
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నథ్ (కేకే) ఆకస్మిక మరణం సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి గుండెపోటు కారణమై
పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడి అభిప్రాయం
కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నథ్ (కేకే) ఆకస్మిక మరణం సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన సమయంలో కేకే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయని, సమయానికి సీపీఆర్ చేసి ఉంటే బతికేవారేమో అని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గత మంగళవారం రాత్రి కోల్‌కతాలో లైవ్ ప్రదర్శన చేసిన కొద్దిసేపటికే కేకే అస్వస్థతకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. గుండె రక్తనాళాల్లో పలు చోట్ల పూడికలు ఏర్పడినట్లు అవే గాయకుడి మరణానికి కారణమైనట్లు పంచనామాలో తేలింది. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు.
‘‘కేకే గుండెలోని ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్ ఏర్పడింది. ఈ నాళంలో దాదాపు 80శాతం పూడిక ఉంది. ఇతర ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్న చిన్న పూడికలు ఉన్నాయి. లైవ్ షో సమయంలో విపరీతమైన ఉద్వేగం కారణంగా అతడి గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసింది. ప్రదర్శన సమయంలో ఆయన నడుస్తూ, అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. అయితే ఒక్కోసారి ఆ ఉద్వేగ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని నిమిషాల పాటు మన గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో గుండె చప్పుడు ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీని ఫలితంగానే కేకే స్పృహ కోల్పోయి కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. అయితే కేకే గుండెలోని ఏ రక్తనాళంలోనూ 100శాతం పూడికలు లేవు. ఒకవేళ, వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి ఉంటే ఆయన బతికేవారేమో’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ డాక్టర్ పీటీఐతో అన్నారు.
ఇక మరణానికి ముందు కేకే యాంటాసిడ్స్ తీసుకున్నారని పోస్టుమార్టంలో తేలినట్లు ఆ వైద్యుడు తెలిపారు. బహుశా కేకే తనకు వచ్చి నొప్పిని అజీర్తి సమస్య అనుకుని యాంటీ యాసిడ్స్ తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆయన హోటల్ గదిలోనూ యాంటాసిడ్స్‌ను గుర్తించినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కేకే భౌతిక కాయాన్ని ముంబయిలోని తన నివాసానికి తీసుకొచ్చారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, గాయకులు ఆయనకు నివాళులర్పించారు. వెర్సోవా హిందూ శ్మశాన వాటిలో కేకే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ