Ganga Vilas: లగ్జరీ క్రూజ్ ‘గంగా విలాస్’ విశేషాలివే..
ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక గంగా విలాస్ (Ganga Vilas) అతి త్వరలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. మరి ఈ లగ్జరీ నౌక విశేషాలేంటీ? దీని టికెట్ ధర ఎంత? తెలుసుకుందాం
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) శుక్రవారం (జనవరి 13) వారణాసిలో ప్రారంభించనున్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా పేరొందింది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి.
51 రోజుల్లో 50 పర్యటక స్థలాలు..
భారత్‌లోని ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్‌లోని నదుల్లో ఈ నౌక (Ganga Vilas) ప్రయాణిస్తుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరధి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్‌లతోని మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. గంగా విలాస్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మొదలయ్యే అస్సాంలోని దిబ్రుగఢ్‌లో ముగుస్తుంది. మొత్తం 51 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యటక ప్రాంతాల్లో ఆగుతుంది. వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చు.
లగ్జరీ సదుపాయాలు..
62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడెల్పు ఉండే ఈ భారీ క్రూజ్ (Ganga Vilas)లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు. మూడు సన్ డెక్‌లు, జిమ్ సెంటరు, స్పా సదుపాయం ఉంది. నదీ వ్యూ కన్పించేలా ఉంటే పారదర్శక లాంజ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. ప్రయాణికులను ఆహ్లాదపర్చేలా నౌకలో కళా సాంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేయనున్నారు.
టికెట్ ధర ఇలా..
జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ నౌక తొలి ప్రయాణం మొదలవుతుంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు మార్చి 1న దిబ్రూగఢ్ చేరుకుంటారని తెలిపారు. మరి ఇంత ప్రత్యేకమైన ఈ గంగా విలాస్ (Ganga Vilas) టికెట్ ధర ఎంతో తెలుసా..? ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ.12.75లక్షల ఖర్చవుతుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నౌక టికెట్లను లగ్జరీ రివర్ క్రూజెస్‌లో బుక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్