Viral news: ఇదేం పెళ్లిరా బాబోయ్.. పీటల మీద కూడా పనేనా?
ఓ వైపు పురోహితుడు పెళ్లి తంతు జరుపుతుండగా.. మరోవైపు వరుడు ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా పని చేసుకుంటున్న ఫొటో ఒకరి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తున్నాడు. పెళ్లి పీటల మీద ఉన్న వరుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా పని చేసుకుంటున్నాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు కానీ, దీనికి సంబంధించిన ఫొటోను ‘కోల్‌కతా ఇన్‌స్టాగ్రామర్స్’ అనే అకౌంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్‌ను ఈ పెళ్లికొడుకు మరోస్థాయికి తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.
‘కనీసం పెళ్లి రోజున కూడా ఆనందంగా ఉండనివ్వరా’? అని కొందరు విమర్శిస్తుండగా.. మరి కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘పెళ్లి రోజున పని చేయాలని ఏ సంస్థ కూడా చెప్పదు. వృత్తి జీవితాన్ని వ్యక్తి గత జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో ఈ పెళ్లి కొడుకు నేర్చుకోవాలి’ అని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం దీనిని ఏదో సరదాకి చేసిన పనిగా కొట్టిపారేశారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. పెళ్లి జరిగిన తొలిరోజు రాత్రే వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేసుకోవడం గత ఏడాది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్ మాజీ పేసర్
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి