Vaccine: కోల్‌కతాలో ఇంటి వద్దకే వ్యాక్సిన్‌!

పశ్చిమ బెంగాల్‌ రాజధాని  కోల్‌కతాలో త్వరలో ఇంటింటికి వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులు.. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) చీఫ్‌ ఫిర్హద్‌ హకీం వెల్లడించారు. కరోనా కట్టడి కోసం

Published : 01 Aug 2021 23:40 IST

కోల్‌కతా: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజలు వ్యాక్సిన్‌ సెంటర్‌ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి.. పేర్లు నమోదు చేసుకొని వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు, అనారోగ్యంతో మంచాన పడిన వారు వ్యాక్సిన్‌ సెంటర్‌కు రాలేరు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. త్వరలోనే ఆరోగ్యశాఖ సిబ్బంది.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి ఇళ్లకు వెళ్లి వారికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కేఎంసీ చీఫ్‌ హకీం వెల్లడించారు.  

80ఏళ్లు పైబడిన వృద్ధులు.. 60ఏళ్లు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు అర్హులుగా పరిగణిస్తామని కేఎంసీ చీఫ్ వెల్లడించారు. వారి వివరాలను కుటుంబసభ్యులు స్థానిక వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో నమోదు చేయించాలని సూచించారు. అలా నమోదు చేసుకున్న వారి ఇళ్లకే ఆరోగ్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తారని చెప్పారు. అయితే, ఆ ఇంట్లో కుటుంబసభ్యులంతా అప్పటికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొని ఉండాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని