Corona: భయపడాల్సిన అవసరంలేదు: సీఎం బొమ్మై విజ్ఞప్తి

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కీలక విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకొంటున్నామని......

Published : 07 Jun 2022 01:05 IST

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కీలక విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకొంటున్నామని.. ఎవరూ అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల అధికారులతో సమావేశమవుతారని.. అక్కడి పరిస్థితులపై సమీక్షించి నియంత్రణ చర్యలపై నివేదిక సమర్పించనున్నారని సీఎం చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా త్వరలోనే కరోనా వ్యాప్తి నివారణకు తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు, కర్ణాటకలో శనివారం 222 కొవిడ్‌ కేసులు రాగా.. ఆదివారం కొత్తగా 301 మందికి వైరస్‌ సోకడంతో పాటు ఒక మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా కేసులు పెరగుతున్న వేళ ఎవరూ అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దు. ఇప్పటికే వైరస్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం’’ అన్నారు.  కొవిడ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ పరిహారం చెల్లించినట్టు చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అందకపోతే తమ దృష్టికి తీసుకొస్తే వారికి కూడా అందేలా చర్యలు తీసుకొంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని