కుంభమేళాకు 91 లక్షల మంది హాజరు!

హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు 91 లక్షల మంది భక్తులు హాజరైనట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 మధ్య వీరంతా పవిత్ర స్నానమాచరించినట్లు తెలిపారు..........

Published : 30 Apr 2021 14:14 IST

హరిద్వార్‌: హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు 91 లక్షల మంది భక్తులు హాజరైనట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 మధ్య వీరంతా పవిత్ర స్నానమాచరించినట్లు తెలిపారు. అత్యధికంగా ఏప్రిల్‌లో 60 లక్షల మంది హరిద్వార్‌లోని ఘాట్లకు చేరుకున్నారని కుంభమేళా ఫోర్స్‌ వెల్లడించింది. 

ఇక ఏప్రిల్‌ 12న ఒకేరోజు 35 లక్షల మంది కుంభమేళాకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఇక మార్చి 11న జరిగిన మహాశివరాత్రి రోజు 32 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించినట్లు తెలిపారు. చివరగా 25 వేల మంది భక్తులు తుది రాజ స్నానం(షాహీ స్నాన్‌) ఆచరించారు. కుంభమేళా ముగిసిన తర్వాత బుధవారం నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ విధించారు. 

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగానే (భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించడం) జరపాలంటూ సాధువులను కోరిన విషయం తెలిసిందే. దీనికి వారు సానుకూలంగా స్పందించడంతో కుంభమేళా ముందుగానే ముగిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని