Cricket: ఈ బాలిక బ్యాట్ పట్టిందంటే..
లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మఖ్సూమాకు చెందిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.
లద్దాఖ్: మనదేశంలో క్రికెట్ గురించి తెలియనివారుండరు. చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది ఆ ఆటను అభిమానిస్తూనే ఉంటారు. స్టార్ క్రికెటర్లను దేవుళ్లలా భావిస్తూ, వారిలా ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునేవారు బోలెడుమంది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు చెందిన మఖ్సూమా కూడా ఇలాగే ఆశపడుతోంది. అంతేగాకుండా బ్యాట్‌తో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.
లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ అమ్మాయికి చెందిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. అందులో ఆ బాలిక బ్యాట్‌ను ఝుళిపిస్తోంది. బంతిని బౌండరీలు దాటించేలా బ్యాటింగ్ చేస్తోంది. వికెట్ల మధ్య హుషారుగా పరుగులు పెడుతోంది. ‘నేను క్రికెట్ ఆడేందుకు మా నాన్న, మా టీచర్ అందిస్తోన్న సహకారమే కారణం. విరాట్ కోహ్లీలా ఆడేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని మఖ్సూమా ఆ వీడియోలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ బాలిక ఆరో తరగతి చదువుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!