IN PICS: రెండు కళ్లూ చాలవు.. లక్షలాది దీపకాంతుల్లో అయోధ్య ధగధగ

‘దీపోత్సవ్‌’(Deepotsav)లో భాగంగా సరయూ నది ఒడ్డున వెలిగించిన 15లక్షల మట్టి ప్రమిదల దీపకాంతుల్లో అయోధ్య నగరం ధగధగ మెరిసిపోయింది.

Published : 24 Oct 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ‘దీపోత్సవ్‌’(Deepotsav)లో భాగంగా సరయూ నది ఒడ్డున వెలిగించిన 15లక్షల మట్టి ప్రమిదల దీపకాంతుల్లో అయోధ్య నగరం ధగధగ మెరిసిపోయింది. ఆదివారం అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ దీపోత్సవ్‌ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. దీపోత్సవ్‌(Deepotsav) వేళ సుందరంగా తీర్చిదిద్దిన సరయూ నది ఒడ్డు(Saryu bank)న వివిధ ఆకృతుల్లో అమర్చిన ఈ దీపాలను వెలిగించేందుకు దాదాపు 22వేల మంది వాలంటర్లు సాయం చేశారు. సరయూ నది ఒడ్డుతో పాటు అయోధ్యలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లోనూ మరికొన్ని ప్రమిదలను వెలిగించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజికల్‌ లేజర్‌ షో(Musical laser show) అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని