Lalu Yadav: డీఎల్‌ఎఫ్‌ కేసులో లాలూకు క్లీన్‌ చిట్‌?

ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు డీఎల్ఎఫ్ అవినీతి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లు సమాచారం. ఇప్పటికే పశుగ్రాసం కుంభ‌కోణంలో దోషిగా తేలి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన.....

Published : 22 May 2021 23:21 IST

దిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు డీఎల్ఎఫ్ అవినీతి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లు సమాచారం. ఇప్పటికే పశుగ్రాసం కుంభ‌కోణంలో దోషిగా తేలి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన ఏప్రిల్‌లోనే బెయిల్‌పై విడుద‌లయ్యారు. లాలూ అవినీతికి పాల్పడ్డట్లు బలమైన ఆధారాలు లభించలేదని.. ఈ నేపథ్యంలో కేసును మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ముంబయిలోని బాంద్రా రైల్వే ప్రాజెక్టు, దిల్లీలోని మరో రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ప్రాజెక్టకును డీఎల్‌ఎఫ్‌కు కట్టబెట్టేందుకు లాలూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది ఆరోపణ. అందుకు ప్రతిగా లాలూకు దిల్లీలో ఓ ప్రాంతంలో రూ.30 కోట్లు విలువ చేసే స్థలాన్ని డీఎల్‌ఎఫ్‌ అక్రమ మార్గంలో కట్టబెట్టిందని అభియోగాలు ఉన్నాయి. అనంతరం నామమాత్రపు ధరకు కంపెనీ షేర్లను సైతం లాలూ కుటుంబ సభ్యులకు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2018లో కేసు నమోదు చేసిన సీబీఐ మూడేళ్ల పాటు విచారణ జరిపింది. అయితే, ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్న నిర్ణయానికి సీబీఐ వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని