Line Of Control: ఎల్‌ఓసీ వెంట కార్చిచ్చు.. పేలుతున్న ల్యాండ్‌మైన్లు!

కార్చిచ్చు కారణంగా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి అమర్చిన మందుపాతరలు పేలిపోతున్నాయి.......

Published : 18 May 2022 23:44 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. కార్చిచ్చు మంటల కారణంగా అక్కడ అమర్చిన మందుపాతరలు పేలిపోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. గత సోమవారం నుంచే కార్చిచ్చు అంటుకుంది. అది నెమ్మదిగా ఎల్‌ఓసీ వైపు వ్యాపించడంతో.. చొరబాటుదారులు రాకుండా ఎల్‌ఓసీ వెంట అమర్చిన దాదాపు ఆరు ల్యాండ్‌మైన్లు పేలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

దీనిపై అటవీశాఖ అధికారి కనార్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ‘గత మూడు రోజుల నుంచి కార్చిచ్చు చెలరేగుతోంది. బలమైన గాలుల కారణంగా మరింత వ్యాపించింది. ఆర్మీతో కలిసి మంటలను ఆర్పివేస్తున్నాం’ అని తెలిపారు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బంది ప్రాంతంలోనూ కార్చిచ్చు అంటుకుంది. అది జిల్లా సరిహద్దులైన ఘంభీర్‌, నిక్కా, పంజ్‌గ్రాయే, మొఘాలా ప్రాంతాల్లోనూ విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని