Underground railway station: మేరఠ్‌లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అతిపెద్ద ఆర్‌ఆర్‌టీఎస్‌ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

Published : 17 Jun 2024 05:53 IST

ఒకే ట్రాక్‌పై మెట్రో, నమోభారత్‌ రైళ్లు

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అతిపెద్ద ఆర్‌ఆర్‌టీఎస్‌ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రైల్వేస్టేషనులో ప్రయాణికులు సులువుగా లోపలకు, బయటకు వెళ్లేలా నాలుగు ప్రవేశ, నిష్క్రమణ గేట్లతోపాటు 20 చోట్ల అత్యాధునిక ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్లతోపాటు అయిదు లిఫ్టులు కూడా అందుబాటులో ఉంటాయి.  ప్రయాణికులకు వైద్యసాయం కోసం ఎన్సీఆర్‌టీసీ ప్రతి స్టేషనులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏసీ డక్ట్‌లను అమర్చారు. ఇందులో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ రైలు నమోభారత్, మేరఠ్‌ మెట్రోరైలు ఒకే ట్రాకుపై పరుగులు పెట్టనున్నాయి. ఇది దేశంలోనే తొలిసారి అని అధికారులు తెలిపారు. మేరఠ్‌ నగరంలోని ఈ బేగంపుల్‌ స్టేషను పొడవు 246 మీటర్లు కాగా, వెడల్పు 24.5 మీటర్లు. సుమారు 22 మీటర్ల లోతున రైల్వేస్టేషను ఉంటుంది. ఇందులోని ట్రాక్‌లపై రెండువైపులా రైళ్లు వెళ్లే సౌకర్యముంది. మేరఠ్‌ మెట్రో కోసం నగరంలో 23 కిలోమీటర్ల వ్యవధిలో మొత్తం 13 స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో మేరఠ్‌ సెంట్రల్, భైంసాలీ, బేగంపుల్‌ రైల్వేస్టేషన్లు భూగర్భంలో ఉన్నాయి. ఇందులో బేగంపుల్‌ రైల్వేస్టేషను పెద్దది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని