Padma awards: బిపిన్ రావత్‌కు పద్మవిభూషణ్.. స్వీకరించిన కుమార్తెలు

రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖులు నేడు ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ బహుమతులను అందజేశారు......

Published : 22 Mar 2022 01:15 IST

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానం

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖులు నేడు ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ బహుమతులను అందజేశారు. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విడతల వారీగా అవార్డుల బహూకరణ చేపట్టగా.. మొదటి విడుతలో భాగంగా సోమవారం ఇద్దరు పద్మవిభూషణ్, 8 మంది పద్మభూషణ్, 54 మంది పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.

భారత తొలి సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​కు మరణానంతరం పద్మవిభూషణ్​ ప్రకటించగా.. ఆయన కుమార్తెలు క్రితిక, తరిణి ఈ అవార్డును అందుకున్నారు. గీతా ప్రెస్‌ మాజీ ఛైర్మన్‌, ​జర్నలిస్ట్‌ రాధేశ్యామ్​ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును స్వీకరించారు.

కాంగ్రెస్ సీనియర్​​ నేత గులాం నబీ ఆజాద్​ పద్మ భూషణ్​ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. పారాలింపిక్​ రజత పతక విజేత దేవేంద్ర ఝఝారియా, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఎండీ సైరస్​ పూనావాలా, పారాలింపిక్స్‌ రజత పతక విజేత దేవేంద్ర ఝఝారియా సహా పలువురికి పద్మ భూషణ్​ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. భారతీయ సినీ దర్శకుడు​ చంద్రప్రకాశ్​ ద్వివేది, హాకీ క్రీడాకారిణి వందనా కటారియా, పారా-షూటర్​ అవని లేఖ్రా, స్వామి శివానంద సహా పలువురు పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు.

మార్చి 28న రెండో విడత..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు