Tejas: విదేశీ గడ్డపై తొలిసారిగా ‘తేజస్‌’ పరాక్రమ ప్రదర్శన!

విదేశీ గడ్డపై తొలిసారి భారత్‌కు చెందిన తేజస్‌ (Tejas) యుద్ధవిమానం తన పరాక్రమాన్ని చూపించనుంది. ఫిబ్రవరి 27 నుంచి యూఏఈలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో పాల్గొననుంది.

Published : 25 Feb 2023 22:28 IST

దిల్లీ: భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధవిమానం (Light Combat AirCraft) ‘తేజస్‌’ (Tejas) తొలిసారిగా విదేశీ గడ్డపై తన పరాక్రమాన్ని ప్రదర్శించనుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 17 వరకు యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించనున్న డిజర్ట్ ఫ్లాగ్‌-8 అంతర్జాతీయ వైమానిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 110 సభ్యుల ‘ఎయిర్‌ వారియర్స్‌’ బృందం పయనమైంది. ఈ మేరకు పీఐబీ వెల్లడించింది. భారత వైమానిక దళం 5 ఎల్‌సీఏ విమానాలతోపాటు సీ-17 గ్లోబ్‌మాస్టర్‌-3 యుద్ధవిమానాలు రెండింటికి అక్కడికి తీసుకెళ్లినట్లు పీఐబీ పేర్కొంది. 

భారత్‌కు వెలుపల జరగుతున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో తేజస్‌ యుద్ధ విమానాలు పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ వైమానిక ప్రదర్శనలలో యూఏఈతోపాటు అమెరికా, ఫ్రాన్స్‌, కువైట్‌, ఆస్ట్రేలియా, బహ్రైన్‌,మొరాకో, స్పెయిన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా దేశాలు పాల్గొననున్నాయి. వివిధ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు,  వైమానిక దళాల సామర్థ్యాన్ని పెంపొందించుకునే లక్ష్యంతోనే ఈ వైమానిక ప్రదర్శన చేపడుతున్నట్లు పీఐబీ పేర్కొంది. వివిధ దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడం వల్ల ఇతర దేశాల నుంచి సరికొత్త అంశాలను నేర్చుకునేందుకు వీలుంటుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని