Army Chief: ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ పాండే.. ఇంజినీర్‌కు తొలిసారి సైన్యం బాధ్యతలు

భారత సైన్యం సారథిగా లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.......

Updated : 18 Apr 2022 19:26 IST

దిల్లీ: భారత సైన్యం సారథిగా లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే ఏప్రిల్​ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ పాండేను ఆయన వారసుడిగా కేంద్రం ఖరారు చేసింది. కార్ప్స్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి ఆర్మీ చీఫ్​ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్​ కోసం పాండేతోపాటు జై సింగ్ నయన్, అమర్​దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్‌ అయిన  పాండేకే బాధ్యతలను అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని