competitive exms: పరీక్షల్లో చీటింగ్‌ చేస్తే జీవిత ఖైదు: ఉత్తరాఖండ్‌ సీఎం

పోటీ పరీక్షల్లో మోసాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

Published : 12 Feb 2023 22:41 IST

దెహ్రాదూన్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో మోసాలు, కుంభకోణాలను అడ్డుకోవడానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో చీటింగ్‌ చేస్తే యావజ్జీవ కారాగారం లేదా పదేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ వెల్లడించారు. 

‘‘యువకుల కలల్ని, ఆశయాలను మా ప్రభుత్వం కాలరాయదు. అందుకే, పరీక్షల్లో ఎవరైనా చీటింగ్‌ చేస్తే వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలు శిక్ష విధిస్తాం. దీంతోపాటు వారి ఆస్తుల్ని జప్తు చేస్తాం’’అని స్పష్టం చేశారు. 

గతంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరీక్ష పత్రాలు లీక్‌ ఘటనలకు సంబంధించి పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు ఇటీవల ఆందోళన చేశారు. దీంతో సీఎం ‘ఉత్తరాఖండ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌’ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గుర్మీత్‌ సింగ్‌ సంతకం చేయడంతో ఆ ఆర్డినెన్స్‌ చట్టంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని