Published : 05/12/2021 22:02 IST

Jammu Kashmir: ‘రైతులమాదిరిగానే మనం సైతం త్యాగాలు చేయాల్సి ఉంటుంది!’

శ్రీనగర్‌: కొత్త సాగు చట్టాల రద్దు కోసం రైతుల మాదిరిగానే జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు సైతం ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35-ఏతోపాటు ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోసం త్యాగాలు చేయాల్సిరావచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అయితే, తమ పార్టీ హింసకు మద్దతు పలకదని చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా జయంతి సందర్భంగా ఆదివారం పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఫరూక్‌ పాల్గొని, ప్రసంగించారు. స్థానికంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. అణగదొక్కుతున్నారని, మీడియా సైతం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు.

‘స్థానికుల ఐక్యతతోనే సాధ్యమైంది’

‘సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో కేంద్రం దిగొచ్చి, వాటిని రద్దు చేసింది! మనం సైతం మన హక్కులను తిరిగి పొందేందుకు అలాంటి త్యాగాలు చేయాల్సి ఉంటుంది’ అని అబ్దుల్లా స్థానికులను ఉద్దేశించి అన్నారు. వాటి పునరుద్ధరణ విషయమై కేంద్రం ఇదివరకే హామీ ఇచ్చిందని చెబుతూ.. ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇటీవల హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు అమాయకులు మృతి చెందగా, అధికారులు ఇద్దరి మృతదేహాలను తిరిగి అప్పగించారని గుర్తుచేస్తూ.. స్థానికుల ఐక్యతతోనే ఇది సాధ్యపడినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని