Chinese Apps: గరీనా ఫ్రీ ఫైర్‌, వాయిస్‌ రికార్డర్.. కేంద్రం నిషేధించిన యాప్స్‌ ఇవేనా..!

దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ యాప్‌లను నిషేధించాలని కేంద్ర హోంశాఖ

Published : 14 Feb 2022 15:51 IST

 

దిల్లీ: దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ యాప్‌లను నిషేధించాలని కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసినట్లు తెలిపాయి. దీనిపై కేంద్ర ఎలక్ట్రాన్సిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. ‘‘ఈ 54 యాప్స్‌ యూజర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ డేటాను తమ సొంతదేశంలో ఉన్న సర్వర్లకు బదిలీ చేస్తూ డేటా దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని’’ హోంశాఖ పేర్కొన్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. 

కాగా.. నిషేధానికి గురైన వాటిల్లో ప్రముఖ గేమింగ్‌ యాప్‌ గరీనా ఫ్రీ ఫైర్‌తో పాటు యాప్‌లాక్‌, వాయిస్‌ రికార్డర్‌, బ్యూటీ కెమెరా వంటి ప్రముఖ యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. నిషేధానికి గురైన యాప్‌ల జాబితాను కేంద్రం ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. జాతీయ మీడియా కథనాల్లో యాప్‌ల పేర్లు బయటకొచ్చాయి. ఇప్పటికే ఫ్రీ ఫైర్‌ గేమ్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి ఈ గేమ్‌ ప్లే స్టోర్లలో కన్పించట్లేదు. అయితే ఫ్రీ ఫైర్‌ మాక్స్‌ గేమ్‌ మాత్రం అందుబాటులోనే ఉండటం గమనార్హం. 2020లో పబ్జీని భారత్‌లో నిషేధించిన తర్వాత ఫ్రీ ఫైర్‌ గేమ్‌కు విశేష ఆదరణ లభించింది. 2021లో ఈ గేమ్‌ను 24 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

నిషేధానికి గురైన యాప్స్‌ జాబితా ఇదే..

1. AppLock

2. Garena Free Fire - Illuminate

3. Voice Recorder & Voice Changer

4. Viva Video Editor - Snack Video Maker with Music

5. Barcode Scanner - QR Code Scan

6. Beauty Camera - Selfie Camera

7. Beauty Camera: Sweet Selfie HD

8. CamCard for SalesForce Ent

9. Conquer Online

10. Conquer Online - MMORPG Game

11. CuteU Pro

12. CuteU: Match With The World

13. Dual Space - 32Bit Support

14. Dual Space - 64Bit Support

15. Dual Space Lite - Multiple Accounts & Clone App

16. Dual Space Pro - 32Bit Support

17. Dual Space Pro - Multiple Accounts & App Cloner

18. DualSpace Lite - 32Bit Support

19. Equalizer - Bass Booster & Volume EQ & Virtualizer

20. Equalizer & Bass Booster - Music Volume EQ

21. Equalizer Pro - Volume Booster & Bass Booster

22. EVE Echoes

23. Extraordinary Ones

24. FancyU - Video Chat & Meetup

25. FancyU pro - Instant Meetup through Video chat!

26. FunChat Meet People Around You

27. APUS Security HD (Pad Version)

28. Isoland 2: Ashes of Time Lite

29. Lica Cam - selfie camera app

30. Live Weather & Radar - Alerts

31. MoonChat: Enjoy Video Chats

32. MP3 Cutter - Ringtone Maker & Audio Cutter

33. Music Player - Equalizer & MP3

34. Music Player - MP3 Player

35. Music Player - Music, MP3 Player

36. Music Plus - MP3 Player

37. Nice video baidu

38. Notes - Color Notepad, Notebook

39. Onmyoji Arena

40. Onmyoji Chess

41. Parallel Space Lite 32 Support

42. RealU Lite -video to live!

43. RealU: Go Live, Make Friends

44. Rise of Kingdoms: Lost Crusade

45. SmallWorld-Enjoy groupchat and video chat

46. Stick Fight: The Game Mobile

47. Tencent Xriver

48. Twilight Pioneers

49. UU Game Booster-network solution for high ping

50. Video Player Media All Format

51. Badlanders

52. Astracraft

53. Volume Booster - Loud Speaker & Sound Booster

54. Wink: Connect Now

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని