Supreme court: విద్యార్థుల ఆత్మహత్యలు.. సుప్రీంకోర్టు ఆందోళన

విద్యార్థుల ఆత్మహత్యల్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు (supreme Court) ఆదేశించింది.

Published : 11 Jul 2024 19:21 IST

దిల్లీ: దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంపై సుప్రీం కోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యల్ని సామాజిక సమస్యగా పేర్కొన్న ఆయన.. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యల్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గౌరవ్‌ బన్సల్‌ అనే న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్‌ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కింద దిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ రాజధానిలో 2014 నుంచి 2018 మధ్య కాలంలో 400 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా 18 ఏళ్ల లోపువారే. 2022లో దేశవ్యాప్తంగా 1.71 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు