Lockdown: గోవాలో రేపటి నుంచి లాక్‌డౌన్

Goa Lockdown: ఏప్రిల్ 29వ తేదీ రాత్రి ఏడు నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్

Updated : 28 Apr 2021 14:56 IST

మూడు రోజులపాటు అమల్లో ఉండనున్న నిబంధనలు

పనాజీ: దేశంలో కొవిడ్ ఉద్ధృతి వేళ మరో రాష్ట్రం లాక్‌డౌన్‌ (Lockdown) నిబంధనలను ప్రకటించింది. వైరస్‌ను కట్టడిచేసే లక్ష్యంతో గోవా ప్రభుత్వం రేపటి నుంచి పలు ఆంక్షలను అమల్లోకి తేనుంది. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి ఏడు నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ బుధవారం ప్రకటించారు. అత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రజా రవాణా, క్యాసినోలు, హోటళ్లు, పబ్బులను మూసివేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. 

ఇక, గోవాలో మంగళవారం 2,110 మందికి కరోనా సోకగా..31 మరణాలు సంభించాయి. ప్రస్తుతం 16,591 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని