Lockdown: కేరళలో లాక్‌డౌన్‌

కేరళలో భారీ మొత్తంలో రోజువారీ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 06 May 2021 12:12 IST

తిరువనంతపురం: కేరళలో భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గట్లేదన్నారు. కొవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ తప్పట్లేదని స్పష్టం చేశారు. కేరళలో నిన్న ఒక్క రోజే 42 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక కేసులు పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో మొదటి నాలుగు స్థానాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని