Parliament: ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
ద్రవ్యవినిమయ బిల్లుకు సంబంధించి ఎలాంటి చర్చ జరపకుండానే లోక్‌సభ ఆమోదం తెలిపింది. తద్వారా సంఘటిత నిధి నుంచి రూ.2,70,509 కోట్లను ఉపసంహరించునేందుకు వీలుపడుతుంది.
దిల్లీ: ఎలాంటి చర్చ లేకుండానే ద్రవ్యవినిమయ బిల్లు-2023కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ సంఘటిత నిధి నుంచి రూ.2,70,509 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధికారం వస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల కోసం దీనిని ఖర్చు చేయనున్నారు. అధికార ప్రతిపక్షాల డిమాండ్లతో గత వారం రోజులుగా సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో కీలక ద్రవ్యవినిమయ బిల్లుకు ఏకపక్షంగా ఆమోదం తెలపడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ప్రతిపాదనకు సంబంధించిన ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిపై లోకసభలో చర్చించి ఆమోదం పొందిన అనంతరం బడ్జెట్ కసరత్తు పూర్తయినట్లు పరిగణిస్తారు.
ద్రవ్యవినియమయ బిల్లులు, ఆర్థికబిల్లులు రెండూ ద్రవ్యబిల్లులే అంటే వీటిని ప్రతిపక్షాలు రాజ్యసభలో అడ్డుకునేందుకు వీలుండదు. లోక్‌సభ ఆమోదం పొందిన ద్రవ్య బిల్లులపై రాజ్యసభలో కేవలం చర్చించి తిరిగి దిగువ సభకు పంపిస్తారు. అంతేతప్ప అందులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు.గత ప్రభుత్వాలు కూడా ద్రవ్యవినిమయ బిల్లును చర్చలేకుండా ఆమోదించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ అవసరాలను తీర్చేందుకు భారత ప్రభుత్వ సంఘటిత నిధి నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మిగతా మొత్తాన్ని పబ్లిక్ ఖాతాలు, చిన్నమొత్తాల పొదుపు ద్వారా సేకరించిన నిధుల నుంచి తీసుకుంటారు. రెండోవిడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఉభయసభల్లోనూ తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. అధికార, ప్రతిపక్షాల డిమాండ్లతో గందరగోళ పరిస్థితుల నడుమే కొన్ని బిల్లులు ఆమోదం పొందుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)