Parliament: జులై 19నుంచి వర్షాకాల సమావేశాలు

జులై 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొవిడ్‌ నిబంధనల నడుమ కొనసాగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

Published : 12 Jul 2021 15:54 IST

కొవిడ్‌ నిబంధనల నడుమ కొనసాగుతాయన్న లోక్‌సభ స్పీకర్‌

దిల్లీ: జులై 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొవిడ్‌ నిబంధనల నడుమ కొనసాగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఇప్పటికే మెజారిటీ సభ్యులు వ్యాక్సిన్‌ తీసుకున్నారని.. ఒకవేళ టీకా తీసుకోని వారు సమావేశాల సమయంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఇప్పటివరకూ 323 మంది ఎంపీలు కరోనా వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో తీసుకున్నారని లోక్‌సభ స్పీకర్‌ తెలిపారు. ఇతర ఆరోగ్య కారణాల వల్ల మరో 23 మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదని చెప్పారు. రెండు సభలు ఏకకాలంలోనే ఉదయం 11గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇక ఈసారి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 19న మొదలై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. అయితే, దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా గత మూడు సమావేశాల వ్యవధిని కుదించగా.. గతేడాది శీతాకాల సమావేశాలు మాత్రం రద్దయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని