Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌ రోగులకు అగ్రరాజ్యం అండ!

దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం......

Updated : 28 Jul 2021 17:49 IST

వాషింగ్టన్‌: దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలికంగా కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులను ఆ దేశ వికలాంగుల చట్టం పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో వికలాంగుల చట్టం 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన తీసుకున్న ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం.. దేశంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఉద్యోగం, తదితర అంశాల్లో అందుతున్న అవకాశాలు, సేవలు దీర్ఘకాలిక కొవిడ్‌ రోగులకూ వర్తించనున్నాయని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి. 

 కొన్ని వారాలు లేదా నెలల తరబడి కరోనాతో బాధపడుతున్నవారిలో అలసట, గుండె దడ, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, బ్రెయిన్‌ ఫాగ్‌ లేదా ఆలోచన, ఏకాగ్రత మందగించడం వంటి లక్షణాలు తలెత్తుతున్నాయని తెలిపాయి. దీంతో వారంతా తమ పనులు తాము చేసుకోవడం, ఇతరులతో సంభాషించడం, నడక, తినడం, నిద్రపోవడం వంటి ప్రాథమిక కార్యకలాపాలకే పరిమితమవుతున్నారని పేర్కొంది. అయితే, దీర్ఘకాలిక కొవిడ్‌ రోగులు ఈ చట్టం పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే తమలో లక్షణాలు ఉన్నట్టు నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం పరిధిలోకి వచ్చేందుకు అర్హత పొందినవారు ఆ దేశంలో వైకల్యంతో బాధపడుతున్న మిగతా వారిలాగే రాయితీలు పొందనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు