S Jaishankar: శ్రీ కృష్ణుడు, హనుమాన్‌లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు

శ్రీకృష్ణ భగవానుడు (Lord Krishna), హనుమాన్‌ (Hanuman)లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కొనియాడారు.

Published : 30 Jan 2023 00:10 IST

పుణె: శ్రీకృష్ణ భగవానుడు (Lord Krishna), హనుమాన్‌ (Hanuman)లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. శ్రీలంకలో సీతను గుర్తించిన హనుమాన్‌.. లంకాదహనం కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన స్వయంగా రాసిన ‘ది ఇండియా వే’ పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గొని.. మహాభారత, రామాయణ ఇతిహాసాలు గొప్పతనాన్ని ప్రస్తావించారు.

కృష్ణుడు, హనుమాన్‌లు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దౌత్యవేత్తలు. ఇది వాస్తవం. దౌత్య కోణంలో వారిని చూస్తే.. వారున్న పరిస్థితులు, వారు చేపట్టిన కార్యక్రమం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించిన తీరును చూస్తే మనకు అర్థమవుతుంది. సీతను తీసుకురమ్మని హనుమాన్‌కు అప్పజెప్పిన పనినే కాకుండా లంకా దహనం కూడా చేశారు. అందుకే ఆయన భిన్న విధాల దౌత్యవేత్తగా అభివర్ణించవచ్చు’ అని కేంద్ర మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్నప్పటికీ ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితి నెలకొనడంతోపాటు ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయని అన్నారు.

‘ది ఇండియా వే: స్ట్రాటజీస్‌ ఫర్‌ యాన్ అన్‌సర్టెయిన్‌ వరల్డ్‌’ పేరుతో కేంద్ర మంత్రి జైశంకర్‌ రాసిన పుస్తకాన్ని ‘భారత్‌ మార్గ్‌’ పేరుతో మరాఠీలోకి తర్జుమా చేశారు. ఈ పుస్తకం విడుదల కార్యక్రమంలో ఇటీవల పుణెలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌.. పైవిధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని