Bihar : రాముడు నా కలలోకి వచ్చి ఏం చెప్పాడంటే..! : బిహార్‌ మంత్రి

రాముడు (Lord Ram) తన కలలోకి వచ్చాడని బిహార్‌ (Bihar) మంత్రి చంద్రశేఖర్‌ (Education Minister Chandra Shekhar) అన్నారు. 

Published : 19 Sep 2023 01:47 IST

పట్నా : రాముడు (Lord Ram) తన కలలోకి వచ్చాడంటూ బిహార్‌ (Bihar) విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ (Education Minister Chandra Shekhar) వ్యాఖ్యానించారు. మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని భగవంతుడు కోరినట్లు చెప్పారు. బిహార్‌లోని రాంపుర్‌ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘రాముడు నా కలలోకి వచ్చాడు. ప్రజలు తనను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు. అలా జరగకుండా నన్ను రక్షించమని కోరాడని’ అన్నారు. 

లంచం విషయంలో గొడవ.. నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు!

మంత్రి చంద్రశేఖర్‌ దేశంలోని కుల వ్యవస్థ, మత విశ్వాసాలు, చారిత్రక వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదంగా మారాయి. ‘రాముడు సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడు. కానీ, నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమే. ఇది విచారకరం. రాష్ట్రపతి, ముఖ్యమంత్రిని కూడా దేవాలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారు. ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేశారు. దేవుడే శబరి ఇచ్చిన ఆహారం తిన్నాడు. కుల వ్యవస్థ పట్ల ఆయన కూడా అసంతృప్తి చెందాడని’ పేర్కొన్నారు. 

గతవారం చంద్రశేఖర్‌ రామాయణాన్ని పొటాషియం సైనేడ్‌తో పోల్చడం మరింత వివాదాస్పదమైంది. అది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పిన ఆయన.. హిందీ రచయిత నాగార్జున, సోషలిస్టు నేత రామ్‌ మనోహర్‌ లోహియా వంటి ప్రముఖులు సైతం ఆ గ్రంథంలో తిరోగమన ఆలోచనలున్నాయని చెప్పారన్నారు. కుల వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దూషణలకు దిగారని, భౌతిక దాడులకు పాల్పడతామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని