Supreme court: కేసు ఓడిపోతే.. అది న్యాయవాది తప్పు కాదు!

కేసు ఓడిపోతే.. అది న్యాయవాది తప్పు కాదని, ఆయన వాదనలో లోపం ఉందనడం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇటీవల ఓ వ్యక్తి ఒక కేసుకు సంబంధించి ముగ్గురు న్యాయవాదులను నియమించుకున్నాడు. ఆ కేసు ఓడిపోవడంతో న్యాయవాదులు సరిగా వాదించలేదంటూ జాతీయ వినియోగదారుల వివాదాల

Published : 11 Nov 2021 21:43 IST

దిల్లీ: కేసు ఓడిపోతే.. అది న్యాయవాది తప్పు కాదని, ఆయన వాదనలో లోపం ఉందనడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ వ్యక్తి ఒక కేసుకు సంబంధించి ముగ్గురు న్యాయవాదులను నియమించుకున్నాడు. ఆ కేసు ఓడిపోవడంతో న్యాయవాదులు సరిగా వాదించలేదంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషన్‌ను కమిషన్‌ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ‘ప్రతి కేసులో న్యాయాన్ని బట్టి గెలుపోటములు ఉంటాయి. ఓటమిలో న్యాయవాది నిర్లక్ష్యం ఏ మాత్రం ఉండదు. దాన్ని న్యాయవాది వాదనలో లోపం అనలేం’’అని కోర్టు పేర్కొంది. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోతారని, అలా ఓడిపోయిన వ్యక్తులు న్యాయవాది సరిగా వాదించలేదని, పరిహారం ఇప్పటించాలని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయిస్తున్నారని కోర్టు తెలిపింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, న్యాయవాదుల వాదనలో లోపాలు ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుందని జస్టిస్‌ ఎం.ఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని