Yogi Adityanath: సీఎం యోగికి బెదిరింపు కేసులో ప్రేమ కోణం!
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదరింపు కాల్ కేసులో ప్రేమ కోణం బయటపడింది.
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు ప్రాణహాని చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ‘112’ నంబరుకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌లో ప్రేమ కోణం ఉన్నట్టు తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై ఉన్న కోపంతో అతడిని కేసులో ఇరికించేందుకు ఓ యువకుడు చేసిన దుశ్చర్యగా పోలీసులు తేల్చారు.
అసలేం జరిగిందంటే..?
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాణాలకు హాని చేస్తామంటూ 112 నంబర్‌కు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ కాల్‌ను ట్రేస్ చేసిన లఖ్‌నవూ పోలీసులు ఫోన్ యజమాని సజ్జాద్ హుస్సేన్‌గా గుర్తించి ఆయన్ను కలిశారు. దీంతో రెండు రోజుల క్రితమే తన ఫోన్ చోరీకి గురైనట్టు అతడు చెప్పాడు. ఇరుగుపొరుగువారిని వాకబు చేయగా.. అమీన్ అనే యువకుడు తన ప్రియురాలి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ఇలా చేసి ఉంటాడని పోలీసులకు తెలిపారు. దీంతో 18 ఏళ్ల అమీన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ తండ్రి సజ్జాద్‌తో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆవేశంతో తన ప్రేయసి తండ్రి సజ్జాద్ హుస్సేన్ ఫోన్‌ను చోరీ చేసి.. అతడిని కేసులో ఇరికించేందుకే సీఎంకు బెదిరింపులు జారీ చేస్తూ 112 నంబర్‌కు కాల్ చేశాడని వివరించారు. నిందితుడిపై ఫోన్ దొంగతనంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం లఖ్‌నవూ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో