Corona: సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు మళ్లీ కరోనా పాజిటివ్‌

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మరోసారి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా....

Published : 15 Feb 2022 16:51 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మరోసారి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల పాటు తన పనినంతా వర్చువల్‌గానే కొనసాగించనున్నట్టు వెల్లడించారు. బుధవారం రోజు జరగబోయే శిరోమణి రవిదాస్‌ జయంతి కార్యక్రమంలోనూ వర్చువల్‌గానే పాల్గొంటానన్నారు. ఇటీవల కాలంలో తనతో కాంటాక్టు అయిన వారంతా జాగ్రత్తగా ఉండటంతో పాటు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ రేటు 2శాతానికి తగ్గినట్టు సీఎం తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1222 కొత్త కేసులు వచ్చాయనీ.. పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంఓత పాటు అన్ని కొవిడ్‌ నిబంధనల్ని పాటించాలని కోరారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇటీవల యూపీ, ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్‌ ముచ్చింతల్‌లోని సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే. కరోనా తొలి దశలోనూ (2020 జులైలో) శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు వైరస్‌ బారినపడ్డారు. అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు. ఆ సమయంలో ఆస్పత్రి నుంచే కొవిడ్‌ పరిస్థితిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని