Diamond: రైతులకు దొరికిన 3.21 క్యారెట్ల వజ్రం.. రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన

Updated : 23 Sep 2022 08:19 IST

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు సహచరులతో కలిసి లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. తాజాగా గురువారం వారికి 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీన్ని వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. దీని విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంత విలువైన వజ్రం దొరకడం వల్ల వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని