betting racket: బెట్టింగ్‌ ముఠాపై దాడులు.. రూ.14.6 కోట్లు స్వాధీనం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రెండు బెట్టింగ్‌ ముఠా స్థావరాలపై గురువారం దాడులు జరపగా పెద్ద మొత్తంలో డబ్బులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పట్టబడ్డాయి.   

Published : 15 Jun 2024 00:09 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ బెట్టింగ్ రాకెట్‌(betting racket) స్థావరంపై అధికారులు దాడులు జరిపారు. ఈ దాడిలో ఏడు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీతోపాటు రూ.14.6 కోట్ల నగదు, 7 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీరితో సంబంధం ఉన్నట్లుగా అనుమానించిన మరో ముఠా రహస్య స్థావరంపై దాడులు చేయగా బెట్టింగ్ రాకెట్‌లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న తొమ్మిది మంది పోలీసులకు చిక్కారు. వారి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరు అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తూ అమాయక ప్రజలను బెట్టింగ్‌లోకి దింపుతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిందితులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉపయోగిస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్నారు. ప్రధాన నిందితుడు పీయూష్ చోప్రా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో గేమింగ్‌ ద్వారా యువకులను బెట్టింగ్‌ ఊబిలోకి దింపుతున్న 9 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని