Sharad Pawar: శరద్‌ పవార్‌కు బెదిరింపు.. స్పందించిన ‘మహా’ డిప్యూటీ సీఎం!

ఎన్సీపీ అధినే శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు.  పోలీసులు చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Published : 09 Jun 2023 15:39 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు బెదిరింపు సందేశాలు రావడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (devendra fadnavis) స్పందించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

‘‘ఏ నాయకుడినైనా బెదిరించడం.. సోషల్‌మీడియాలో తమ భావాలు వ్యక్తపర్చే క్రమంలో హద్దులు దాటి ప్రవర్తించడాన్ని ఉపేక్షించం. ఈ ఘటనపై పోలీసులు చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారు’’అని దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. గురువారం శరద్‌ పవార్‌ను బెదిరిస్తూ తనకు వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చినట్లు ఆయన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని