Omicron: మహారాష్ట్రలో 32కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో నలుగురిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. దీంతో రాష్ట్రంలో.........

Published : 15 Dec 2021 22:28 IST

ముంబయి: మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో నలుగురిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 32కి చేరినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 25 మంది కోలుకోవడంతో వారికి పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. తాజాగా బయటపడిన నాలుగు కేసుల్లో ఇద్దరు ఉస్మానాబాద్‌కు చెందినవారు కాగా.. ఒకరు ముంబయి, మరొకరు బుల్దానాకు చెందినవారిగా గుర్తించినట్టు తెలిపారు. వీరందరి శాంపిల్స్‌ని డిసెంబర్‌ తొలివారంలో సేకరించి పరీక్షలకు పంపగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిందని అధికారులు పేర్కొన్నారు.

నలుగురు రోగుల్లో ఒకరు మహిళ కాగా.. ముగ్గురు పురుషులు. వీరంతా 16 నుంచి 67 ఏళ్ల లోపు వారే. ఎవరిలోనూ లక్షణాల్లేవు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉస్మానాబాద్‌కు చెందిన వారిలో ఒక రోగి షార్జా ప్రయాణించగా.. మరొకరు అతడితో కాంటాక్టు అయినట్టు గుర్తించారు. అలాగే, బుల్దానాకు చెందిన రోగి దుబాయికి ప్రయాణం చేయగా.. ముంబయికి చెందిన వ్యక్తి ఐర్లాండ్‌కు ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. వీరందరినీ ఆస్పత్రుల్లో ఐసోలేట్‌ చేసిన అధికారులు.. వీరితో కాంటాక్టు అయినవారిని గుర్తిస్తున్నారు. ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ముగ్గురు టీకాలు వేయించుకోగా.. ఒకరు టీకా వయో పరిమితి దృష్ట్యా టీకా వేయించుకోలేదని వివరించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని