Maharashtra Calls Bandh: మహారాష్ట్రలో రేపు బంద్‌.. కానీ, మేము పాటించం: వ్యాపారులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటనకు నిరసనగా రేపు(అక్టోబర్ 11న) రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది

Published : 10 Oct 2021 20:53 IST

ముంబయి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటనకు నిరసనగా రేపు(అక్టోబర్ 11న) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్‌ అఘాడి  ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎన్‌సిపి, కాంగ్రెస్, శివసేన కూటమి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది. రైతులకు మద్దతుగా బంద్‌ పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేసి ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ప్రకటనపై ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA) స్పందిస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన సంఘటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. కానీ, బంద్‌కు మాత్రం మా మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

‘‘కరోనా వ్యాప్తితో విధించిన లాక్‌డౌన్‌ వల్ల చాలా ఆర్థిక  ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా పుంజుకొంటున్నాయి. పండగల సీజన్‌ కావడంతో ప్రజలు షాపింగ్ చేయడానికి వస్తారు. మా వ్యాపారాలను ప్రశాంతంగా చేసుకోనివ్వండి. రిటైల్ దుకాణాలను తెరిచి ఉంచేలా అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా దుకాణాలను బలవంతంగా మూసివేయవద్దని కోరుతున్నాం’’ అని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని