- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
అసలు నిజాన్ని ఎప్పటికి కనుగొంటారు..?
ఎన్‌ఐఏను విమర్శించిన మహారాష్ట్ర కాంగ్రెస్
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో జరిగిన పేలుడు పదార్థాల వాహనం కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జాప్యం చేస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్ విమర్శించింది. ఘటన జరిగి 150 రోజులు గడుస్తున్నా కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ శనివారం మాట్లాడుతూ.. ‘ఘటన జరిగి ఇప్పటికే 150 రోజులు గడిచిపోయాయి. అయినా కేసు విచారణ పూర్తి కాలేదు. కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి కాల పరిమితి 90 రోజులే.. కానీ, అదనంగా 30 రోజుల గడువును ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఎందుకోసం విచారణ గడువును పెంచుకుంటూ పోతున్నారు. ఘటనకు సంబంధించిన అసలు నిజాన్ని ఎప్పటికి కనుగొంటారు’ అని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిచి ఉండటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు వాహనాన్ని గుర్తించిన కొద్ది రోజులకే ఆ వాహన యజమాని మన్‌సుఖ్ హిరెన్ ఓ వాగులో శవమై దొరకడం కలకలం రేపింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటివరకు ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి సచిన్ వాజేనే ఆ వాహనాన్ని ముకేశ్ అంబానీ ఇంటివద్ద నిలిపినట్లు ధ్రువీకరించారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వాజేకు సహకరించిన ఇద్దరు పోలీసును గతంలో అరెస్టు చేయగా తాజాగా మరో పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Electric bikes: కుషాయిగూడలో పేలిన రెండు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు.. భారీగా ఎగసిన మంటలు
-
Politics News
Pawan Kalyan: పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని: పవన్‌కల్యాణ్
-
World News
Salman Rushdie: వారే కారణం..! రష్దీ దాడి ఘటనపై ఇరాన్ స్పందన
-
India News
Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
-
Sports News
Ross Taylor : ఆ స్టార్ క్రికెటర్‌ను మా దేశం తరఫున ఆడమని కోరా: కివీస్ మాజీ బ్యాటర్
-
Movies News
Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!