Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం

మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా 6,000 రూపాయల నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్కారీ మహాసమ్మాన్‌ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.

Published : 30 May 2023 23:55 IST

ముంబయి: మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా 6,000 రూపాయల నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్కారీ మహాసమ్మాన్‌ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. రైతులకు ఇప్పటికే ఏటా ప్రదానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అందిస్తున్న రూ. 6,000లకు ఇది అదనమని శిందే చెప్పారు. 2023-24 బడ్జెట్‌లో తాజా పథకం గురించి ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని