మహారాష్ట్రకు కోటిపైనే వ్యాక్సిన్‌ డోస్‌లు ఇచ్చాం!

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ కొరత అంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం

Published : 11 Apr 2021 02:07 IST

పుణె: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతపై వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. కరోనా మరోసారి విజృంభిస్తున్న మహారాష్ట్రలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ స్టాక్‌ లేదంటూ బోర్డు కనిపించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర  మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పందించారు. మహారాష్ట్రకు 1.10కోట్ల కరోనా వ్యాక్సిన్‌లను సరఫరా చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌, రాజస్థాన్‌లూ కోటికిపైగా వ్యాక్సిన్‌ డోస్‌లు అందుకున్నాయని వివరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 1,100 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..‘శుక్రవారం సాయంత్రం 6గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం కేవలం ఒక్క మహారాష్ట్రకే 1.10కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించాం. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లు మాత్రమే కోటికి పైగా కరోనా డోస్‌లు అందుకున్నాయి’ అని అన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తోందా? అన్న ప్రశ్నకు ‘రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని