Published : 04 Jul 2022 22:01 IST

Eknath Shinde: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తాం.. శిందే కీలక ప్రకటన

ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఇంధన ధరలపై వ్యాట్‌ తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.

గతవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శిందే.. నేడు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో ప్రసంగించిన శిందే.. ‘‘త్వరలో జరగబోయే కేబినెట్‌ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్రం ఇటీవల రెండు సార్లు తగ్గించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరింది. అయితే, వ్యాట్‌ తగ్గించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఈ విషయమై ఆ మధ్య కేంద్రం, అప్పటి ఠాక్రే సర్కారు మధ్య మాటలయుద్ధం కూడా జరిగింది. తాజాగా భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే.. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించనున్నట్టు ప్రకటించడం గమనార్హం.

దేశంలో గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే పెట్రోల్‌ ధర ముంబయిలోనే అత్యధికంగా ఉంది. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.35, డీజిల్‌ ధర రూ.97.28గా ఉంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని