అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నం

మహారాష్ట్రలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. రైల్వేస్టేషన్‌లో రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చే సమయంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు....

Published : 26 Feb 2021 17:39 IST

ముంబయి: మహారాష్ట్రలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. ఫిబ్రవరి 24న పాల్గర్‌లోని విరార్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్‌లో రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చే సమయంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. దీంతో ఇరు ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వ్యక్తి పట్టాలపై పడుకోవడాన్ని చూసిన అవతలి ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రైల్వే పోలీసు పరిగెత్తుకొని వచ్చి అతడిని పట్టాలపై నుంచి పక్కకు లాగాడు. దీంతో స్టేషన్‌లోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని