మహారాష్ట్ర: నెలలో 7గురు మంత్రులకు కొవిడ్
ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో ఛగన్ భుజ్‌బల్ ఏడవవారు కావటం గమనార్హం.
ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
ముంబయి: మహారాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా సోకినట్టు వెల్లడైంది. కాగా, ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో ఆయన ఏడో వ్యక్తి కావటం గమనార్హం. ఇప్పటి వరకూ అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర షింగ్రే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్‌పాటిల్, బచ్చు కాడులకు కొవిడ్ వ్యాధి సోకింది. కాగా, గతేడాది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా 12 మంది రాష్ట్ర మంత్రులకు సోకిన సంగతి తెలిసిందే.
తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా ఆయన తెలిపారు. ఇటీవలి రెండు, మూడు రోజుల్లో తనకు సమీపంలో వచ్చిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. మహారాష్ట్ర, కేరళ వంటి తదితర రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ప్రభుత్వాలను పరుగులు పెట్టిస్తోంది. లాక్‌డౌన్, రాత్రికర్ఫ్యూ వంటి వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. ఇటీవల కాలంలో కొవిడ్ టీకాలకు అనుమతులు, పాజిటివ్ కేసుల్లో తగ్గుదలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొంది. అయితే గతవారం రోజుల్లో కొవిడ్ కేసుల్లో ఉన్నట్టుండి పెరుగుదల కనిపిస్తోంది. 15 వారాల అనంతరం కొత్త కేసులు భారీగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కోటి పది లక్షల మందికి పైగా వైరస్ సోకగా..65 రోజుల్లో చివరి పది లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో 1,00,990 కేసులు బయటపడగా. గత వారంతో పోలిస్తే, 31 శాతం ఎక్కువకావడం గమనార్హం. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరగడం ఈ కొత్త కేసులకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే టీకాల రాకతో, ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్య వైఖరి కూడా కారణంగా తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wWBC: నిఖత్ జరీన్ పసిడి పంచ్.. వరుసగా రెండో సారి ప్రపంచ ఛాంపియన్!
-
India News
Rahul Gandhi: ట్విటర్ బయోను మార్చిన రాహుల్
-
Politics News
Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్ రెడ్డి
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!