మహిళ మృతి కేసు.. ‘మహా’ మంత్రి రాజీనామా

మహరాష్ట్ర అటవీ శాఖ మంత్రి, శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ రాథోడ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్‌తో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఆదివారం.......

Published : 28 Feb 2021 17:31 IST

ముంబయి: మహరాష్ట్ర అటవీ శాఖ మంత్రి, శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ రాథోడ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్‌తో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మరణించిన టిక్‌టాక్‌ స్టార్‌ పూజా చవాన్‌ (22) కేసులో సంజయ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో మంత్రి ఉన్న ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు బయటకు రావడంతో విపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి.

ఈ నేపథ్యంలో సంజయ్‌ రాథోడ్‌ తన భార్యతో కలిసి సీఎం ఉద్ధవ్‌తో ఈ అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విచారణ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా పొందిన పేరును నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. రాథోడ్‌ కేవలం మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని