Delta plus: మహారాష్ట్రలో తొలి మరణం నమోదు!

కరోనా వైరస్‌ రోజుకో కొత్త రూపంతో మానవాళిపై విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణంలో కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ చాపకింద .....

Published : 25 Jun 2021 16:00 IST

ముంబయి: కరోనా వైరస్‌ రోజుకో కొత్తరూపంతో మానవాళిని కలవరపెడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణంలో కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గత నెలలో మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో ఒకరు మరణించినట్టు వార్తలు రాగా.. తాజాగా మహారాష్ట్రలో తొలి మరణం సంభవించినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రత్నగిరి జిల్లా సంఘమేశ్వర్‌ ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్‌ వైరస్‌ బారినపడి మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. అయితే, ఆమెకు వయోసంబంధమైన ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలిపారు. 

దేశంలోనే అత్యధికంగా డెల్టాప్లస్‌ కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 21 కేసులు ఉండగా.. ఒకరు మరణించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 20 కేసులు ఉన్నాయని, వారందరినీ వైద్య బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పేర్కొన్నారు.

టీకా పంపిణీలో మహారాష్ట్ర రికార్డు

టీకాల పంపిణీలో మహారాష్ట్ర కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలో మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,00,27,217 డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని