అక్కడ ఒకప్పుడు మృత్యు విలయం.. మరి ఇప్పుడు?

కరోనా మొదటి వేవ్‌.. రెండో వేవ్‌.. మూడో వేవ్‌.. ఇలా ఏ ఉద్ధృతిలోనైనా భారత్‌లో అత్యంత దారుణంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర.

Published : 21 Mar 2022 01:19 IST

మహారాష్ట్ర కొత్త ‘పాజిటివ్‌’ రికార్డు

ముంబయి :  కరోనా మొదటి వేవ్‌.. రెండో వేవ్‌.. మూడో వేవ్‌.. ఇలా ఏ ఉద్ధృతిలోనైనా భారత్‌లో అత్యంత దారుణంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. వైరస్‌ తొలినాళ్లలో దేశంలో నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా ఇక్కడి నుంచే వచ్చేవి. ఇలా ఒకప్పుడు రోజుకు లక్షకు చేరువగా కేసులు, వేలల్లో మరణాలతో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన కేసులు ఎన్నో తెలుసా..? కేవలం వంద లోపే. ఇక మరణాల సంఖ్య ఒక్కటి మాత్రమే. రెండేళ్ల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో ఇక్కడ కేసులు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో మహమ్మారి క్రమంగా క్షీణిస్తోన్న సమయంలో.. మహారాష్ట్రలో కూడా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుతున్నాయి.

*గత రెండేళ్లలో 78.7 లక్షల కేసులు, 1.43 లక్షల మరణాలు నమోదైన మహారాష్ట్రలో  శనివారం నమోదైన కేసులు 97.

* ఇక ఈ రాష్ట్రంలో నిన్న నమోదైన మరణాల సంఖ్య 1. అది కూడా సతారా ప్రాంతంలో చోటుచేసుకుంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తాజాగా 29 కేసులే నమోదు కాగా.. పక్కనే ఉన్న థానే జిల్లాలో కేవలం ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఒకప్పుడు కరోనా మృత్యు విలయం సృష్టించిన ముంబయిలో.. తాజాగా నమోదైన మరణాలు సున్నా. ఈ నెలలో అక్కడ నమోదైన మరణాలు రెండే కావడం గొప్ప ఊరటనిచ్చే విషయం.

* ఇక పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం వైరస్‌ ఉద్ధృతి క్రమంగా క్షీణిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొత్త కేసులు 17 వందలకు దిగివచ్చి 688 రోజుల కనిష్ఠానికి చేరాయి. ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసులు 26 వేలు మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని